ఎంపీ వద్దిరాజు లేఖకు రైల్వే మంత్రి స్పందన

KMM: చింతకాని (M)రామకృష్ణాపురం 107 రైలు క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణంపై కదలిక వచ్చింది. రామకృష్ణాపురం 107 లెవల్ క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే మంత్రికి లేఖ రాశారు. వినతిపై రైల్వే మంత్రి స్పందిస్తూ సాధ్యాసాధ్యలను సంబంధించి సమగ్ర నివేదిక కోరుతూ రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారు.