యువకుడిది హత్యా..? ఆత్మహత్యా..?
SRCL: వేములవాడ సిద్ధార్థ లాడ్జిలో బుధవారం యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన భూక్య మోహన్ (26)గా పోలీసులు గుర్తించారు. అద్దె గదిలో అచేతనంగా పడి ఉండటంతో లాడ్జితో నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. హత్య? ఆత్మహత్య? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.