VIDEO: పర్యాటక ప్రాంతాల్లో జన సంద్రం
VSP: విశాఖ తీర ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడాయి. ఆదివారం సెలవు దినం కావడంతో ఆర్కే బీచ్, రుషికొండ బీచ్‌ల వద్ద ఉదయం నుంచే జనసంద్రం కనిపించింది. రుషికొండలో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్‌తో పర్యాటకులు సందడి చేయగా, ఆర్కే బీచ్‌లో చిన్నారుల ఆటపాటలతో సందడి నెలకొంది. పెరిగిన రద్దీ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.