చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

CTR: ఉపాధి హామీ పథకం ఏపీడీలు, ఏపీవోలు పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎన్నో అభివృద్ధి పనులు చేపట్ట వచ్చని చెప్పారు. భూగర్భ జలాల పెంపునకు ఫారం ఫాండ్ నిర్మాణాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ అంశంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.