సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు నివేదికలు సమర్పించాలి

NZB: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు మంగళవారం సాయంత్రం లోపు ఆయా శాఖల వారీగా నివేదికలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు విషయంపై అధికారులకు పలు సూచనలు చేశారు.