ఘనంగా క్రిస్మస్ క్యారల్స్ వేడుకలు

ఘనంగా క్రిస్మస్ క్యారల్స్ వేడుకలు

కృష్ణా: గన్నవరం మండలం కొండపావులూరు పరిధిలో ఉన్న ఆర్సీఎం చర్చిల్లో క్రిస్మస్ క్యారల్స్ ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి చిక్కవరం గ్రామంలో ఫాదర్ తోకల సురేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ క్యారల్స్, సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రతి ఇంటికి బాల యేసు స్వరూపంతో ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రీస్తు సందేశాన్ని ప్రజలకు బోధించారు.