'గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులే పునాది'
SKLM: గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు పునాదులుగా నిలవాలని ఎంపీపీ దీప అన్నారు. బూర్జ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వార్డు సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి వార్డ్ మెంబర్లు కీలక పాత్ర పోషించాలని ఎంపీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతిరావు, ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ రామకృష్ణ నాయుడు, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.