VIDEO: 'గంజాయి సమాచారదారులకు రివార్డు'
MHBD: తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ శబరీష్ హాజరై ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. గంజాయి సరఫరాదారులపై సమాచారం అందించిన వారికి రూ.5,000 రివార్డు ఇస్తామని ప్రకటించారు.