భూభారతి పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి: కలెక్టర్

WNP: భూభారతి రెవిన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన పెండింగ్ అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో తాహసిల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 వరకు వచ్చిన సాదా బైనామాలను మాత్రమే నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని సూచించారు.