భారతీయుల దమ్ము ఏంటో పాక్‌కు తెలిసింది: ఎమ్మెల్యే

NGKL: భారత సైనికుల దమ్ము ఏంటో పాకిస్థాన్‌కు తెలిసొచ్చిందని కల్వకుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ పేరిట 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు దాడి చేసి ధ్వంసం చేయడం ఎంతో గర్వకారణమని అన్నారు. భారత సైనికులకు దేశ ప్రజలందరూ అండగా నిలిచి, వారిలో మరింత ఆత్మస్థైర్యం నింపాలని ఆయన కోరారు.