VIDEO: ఫేషియల్ హాజరుతో కూలీలకు ఇబ్బందులు

VIDEO: ఫేషియల్ హాజరుతో కూలీలకు ఇబ్బందులు

ASR: డుంబ్రిగూడ మండలం కమలబంధ గ్రామంలో ఉపాధి కూలీలు ఫేషియల్ అటెండెన్స్ విధానంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం, మధ్యాహ్నం ఫోటోలు తీయాల్సి రావడం కష్టంగా మారిందన్నారు. నెట్‌వర్క్ సమస్యలతో ఫోటోలు అప్లోడ్ కాక హాజరు నమోదు కుదరడం లేదని తెలిపారు. దీంతో పని చేసినా వేతనాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను కోరారు.