ఈవోపై దాడిని ఖండించిన మంత్రి తుమ్మల

ఈవోపై దాడిని ఖండించిన మంత్రి తుమ్మల

KMM: భద్రాచలం రామాలయ ఈవో రమాదేవిపై ఏపీలోని పురుషోత్తపట్నం వాసులు భూ ఆక్రమణదారులు దాడి చేయడాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఈవోను ఫోన్‌లో పరామర్శించిన ఆయన ఈ ఘటన దురదృష్టకరమన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆలయ భూముల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చించి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.