సర్పంచ్ అభ్యర్థి బిందెలు పంపిణీ
KMR: తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో ఓ సర్పంచ్ అభ్యర్థి బిందెలు పంపిణీ చేస్తుండగా ఎన్నికల ప్రత్యేక అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. అభ్యర్థి నుంచి 41 బిందెలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎవరైనా అభ్యర్థులు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మద్యం డబ్బు ఇతర వస్తువులను పంపిణీ చేసినట్లయితే వారిపైన చర్యలు తప్పవన్నారు.