హాస్టల్ తనిఖీ చేసిన ఎంపీడీవో హరి సింగ్

హాస్టల్ తనిఖీ చేసిన ఎంపీడీవో హరి సింగ్

SRPT: కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి మండలం శాంతినగర్ హాస్టల్‌ను ఎంపీడీవో హరి సింగ్ తనిఖీ చేశారు. హాస్టల్లో పరిశుభ్రత, భోజన నాణ్యత, తాగునీటి సౌకర్యం, వంటగది, భోజనశాల, నిద్ర గదులు వంటి వసతులను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాల గురించి ఎంపీడీవో అడిగి తెలుసుకున్నారు.