అమ్మవారి సేవలో మాజీ ప్రధాన న్యాయమూర్తి

CTR: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సోమవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.