బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి నియామకం

VZM: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా విజయనగరం జిల్లాకు చెందిన రెడ్డి పావని శుక్రవారం నియమితులయ్యారు. ఈమె రెండో సారి ఈ పదవిని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమెకు జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఆమె ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చీపురుపల్లి నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ మన్నెపురి శ్రీనివాసరావు ఆకాంక్షించారు.