అధ్వానంగా కొల్హారి రోడ్డు

ADB: బజార్ హత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామం వద్ద రోడ్డు అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చోడ నుంచి సోనాలా, మహారాష్ట్ర సరిహద్దులను కలిపే ఈ ప్రధాన రహదారిని పట్టించుకునే వారు లేరని వాహనదారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడినప్పుడు పరిస్థితి దారుణంగా తయారవుతుందని వాపోతున్నారు. అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయాలని కొరారు.