చల్లపల్లిలో స్వచ్ఛత కార్యక్రమాలు
కృష్ణా: స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో స్వచ్ఛత కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచిన చల్లపల్లి గ్రామం అందరికీ ఆదర్శనీయమని, అందుకు కృషి చేసిన డా.డీఆర్‌కే ప్రసాద్ అభినందనీయులని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పీ.కృష్ణయ్య పేర్కొన్నారు.