జిల్లాలో 10 విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
CTR: జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్, ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు చేశామని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఏవైనా ఫిర్యాదులకు డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 9032185001ను సంప్రదించాలన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 21,051, ప్రైవేట్ (ఒన్స్ ఫెయిల్డ్) విద్యార్థులు 2,044 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు చెప్పారు.