కొండాపూర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి

NZB: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామంలో బుధవారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పోరాటాలు, సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన దారిలో అందరూ నడవాలని మాజీ జెడ్పిటీసీ హనుమాన్లు అన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన కృషిని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు.