మేదరమెట్లలో కార్డన్ సెర్చ్ నిర్వహణ
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని డీఎస్పీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇళ్లలో సోదాలు చేసి, వాహనాలను తనిఖీ చేసి, పత్రాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.