‘మహిళా ప్రాతినిధ్యంలో అంగోలా నిబద్ధత అభినందనీయం’
ఆఫ్రికాలో 6 రోజుల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగోలా పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అంగోలా పార్లమెంట్‌లో 39% పైగా మహిళా సభ్యులు ఉండటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా ప్రాతినిధ్యం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఇది ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం, సమానత్వం పట్ల అంగోలా నిబద్ధతను తెలియజేస్తుందని ముర్ము కొనియాడారు.