అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
KMR: ఎల్లారెడ్డిలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పట్టుకుంది. మంగళవారం రాత్రి బృందం సభ్యులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిలోని మల్లయ్యపల్లి గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 25 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. సందర్భంగా పాపన్నపేట్ మండలం లింగయ్యపల్లి గ్రామానికి చెందిన రమేష్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.