ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించిన తమిళనాడు డీజీపీ

ELR: తమిళనాడు డీజీపీ (శిక్షణ) డాక్టర్ సందీప్ రాయ్ రాథోడ్ బుధవారం ఏలూరు జిల్లాలోని పెదవేగి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆయనతో ఉన్నారు. శిక్షణా సిబ్బంది నివాసాలు, ఆహార నాణ్యత, ఆధునిక పాఠ్యాంశాలపై ఆయన సమీక్షించారు. శిక్షణ నాణ్యతను మరింత పెంచడంపై చర్చలు జరిపారు.