3వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
మహబూబ్‌నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తమ న్యాయపరమైన 32 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విధులను బహిష్కరించారు. దీంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించడంతో ప్రయాణికులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు.