బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఒక బాల్యవివాహాన్ని పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. స్థానిక క్లాసిక్ ఫంక్షన్ హాల్‌లో బాల్యవివాహం జరుగుతుందన్న సమాచారంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసుల సహకారంతో ఫంక్షన్ హాల్ చేరుకొని వివాహాన్ని అడ్డుకున్నారు. వధువు వరులను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.