అడ్డాకులలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

MBNR: అడ్డాకుల మండలం కాటవరంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో సోమవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.