ఉపాధ్యాయురాలిగా గీతారూత్ సేవలు అభినందనీయం

ఉపాధ్యాయురాలిగా గీతారూత్ సేవలు అభినందనీయం

KDP: మూడు దశాబ్దాల పాటు ఉపాధ్యాయురాలిగా విద్యారంగానికి గీతారూత్ చేసిన సేవలు అభినందనీయమని ఎంఈవో మస్తాన్ వలి, STU రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి పేర్కన్నారు. శుక్రవారం పుల్లారెడ్డిపల్లె MPPSలో విధులు నిర్వహిస్తూ, పదవీ విరమణ పొందిన గీతారూత్‌ను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు ఆమె విద్యారంగానికి, విద్యార్ధులకు అందించిన సేవలను కొనియాడారు.