ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే
SKLM: పొందూరులో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుట కొరకు, అడ్మిషన్ల పెంపు కోసం సోమవారం భారీ అవగాహన ర్యాలీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాసులు, మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సమానంగా విద్యా నాణ్యత పెరిగిందని ఆయన స్పష్టం చేశారు.