రేపటి నుంచి విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం

రేపటి నుంచి విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం

SRD: సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రేపటి నుంచి జూన్ 5వ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో కుట్లు అల్లికలు, సంగీతం, చిత్ర లేఖనం, వ్యక్తిత్వ వికాసం, చదరంగం, టీఎల్ఎంలపై శిక్షణ ఇస్తామని, ఆసక్తి గల విద్యార్థులు పాఠశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.