పేదలకు అండగా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే
GNTR: పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.