ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

BHPL: టేకుమట్ల(M) శివారులోని HP పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ అదుపుతప్పి నడుచుకుంటూ వెళ్తున్న రాజ కొమురయ్య(60)ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అంబులెన్స్‌లో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.