DCCB ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ

పశ్చిమగోదావరి: కూటమి ప్రభుత్వం తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ల ఎంపికపై దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాలోని సహకార బ్యాంకుల్లో రుణాల మంజూరు, మొండి బకాయిలు, ఇతర లోపాలు ఉన్న నేపథ్యంలో వాటిని సరిచేసే అనుభవం ఉన్న నాయకుడి కోసం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన నుంచి పలువురు పేర్లు ప్రచారంలో ఉండటంతో ఆ అదృష్టం ఎవరిని వరిస్తందనే ఉత్కంఠ నెలకొంది.