'రైతులు డ్రోన్లు ఉపయోగించుకోవాలి'

'రైతులు డ్రోన్లు ఉపయోగించుకోవాలి'

KDP: కొండాపురం మండలంలోని బురుజుపల్లిలో రైతులకు సబ్సిడీతో ప్రభుత్వం అందించే డ్రోన్‌లను జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్ భూపేశ్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. 80 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందించే ఈ డ్రోన్‌లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొండాపురం మండలం కూటమి ఇంఛార్జ్ శివ నారాయణ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.