తుక్కాపురంలో దొంగలు బీభత్సం

BNG: మండలం తుక్కాపురం గ్రామంలో నిన్న అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని దుండగులు గ్రామంలోని గోపగాని నవీన్ ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న బీరువాను బయటకు ఈడ్చుకు వెళ్లి నగదుతో పాటు పుస్తెలతాడును ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ చోరీ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.