VIDEO: అర్ధవీడులో గేదెపై పెద్దపులి దాడి

VIDEO: అర్ధవీడులో గేదెపై పెద్దపులి దాడి

ప్రకాశం: అర్ధవీడులోని యాచవరం గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోకి మేత కోసం వెళ్లిన గేదెపై పెద్దపులి దాడి చేసి చంపింది. శుక్రవారం అటువైపుగా వెళ్లిన గ్రామస్థులు గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి పాద ముద్రలను గుర్తించారు.