ఆలయంలో పనుల కోసం కొటేషన్లు వేయండి
ATP: గుంతకల్లులోని కోదండ రామస్వామి దేవాలయంలో ఈనెల 27 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో చేసే పనులకు కొటేషన్లు అందజేయాలని ఆలయ ఈవో మల్లికార్జున మంగళవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 21న సాయంత్రం 5 గంటల లోపు కొటేషన్లను అందజేయాలని వారు పేర్కొన్నారు.