ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ

KRNL: స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా ఎమ్మిగనూరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని MLA BV జయనాగేశ్వర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు జీరో టికెట్ అందజేశారు. అనంతరం ఎమ్మిగనూరు నుంచి బనవాసి వరకు వెళ్లి అక్కడ టెక్స్ టైల్ పార్క్ గురించి మహిళలకు వివరించారు. అనంతరం సూపర్ 6 హామీల్లో భాగంగా కీలకమైన ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చామన్నారు.