బీజేపీకి ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడంటే?
ఒడిశాలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ క్రాస్ ఓటింగ్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన అభ్యర్థికి కాకుండా బీజేపీకి అభ్యర్థికి ఓటు వేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడంతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఒడిశాలో ప్రస్తుతం 4 స్థానాలకు ఓటింగ్ జరిగింది.