'సుంకేసులలో ఉచిత వైద్య శిబిరం'
ప్రకాశం: పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామంలో సర్పంచ్ గుడ్డెపోగు రమేష్ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ వారు మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు 160 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగినదని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.