డివిజన్‌లో 120 చెరువుల నోటిఫై
MDK: తూప్రాన్ డివిజన్ పరిధిలో 120 చెరువులను వెట్‌ల్యాండ్స్‌గా నోటిఫై చేసినట్లు ఆర్డీఓ జయచంద్రారెడ్డి వెల్లడించారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతకు, పక్షుల సంరక్షణకు చెరువుల పరిరక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చెరువుల ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, ఫారెస్ట్, పంచాయతీ శాఖ అధికారులను ఆదేశించారు