VIDEO: భార్య కాపురానికి రాట్లేదని సెల్ టవర్ ఎక్కాడు

అన్నమయ్య: తన భార్య కాపురానికి రాట్లేదని మనస్తాపం చెందిన భర్త సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ ఘటన రైల్వేకోడూరులో బుధవారం చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్-లత పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రతిరోజూ మద్యం తాగి కుటుంబాన్ని పట్టించుకోట్లేదని లత పుట్టింటికి వెళ్లింది. దీంతో భార్య కాపురానికి వచ్చే వరకు టవర్ దిగనని హైడ్రామా నెలకొల్పాడు.