గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం

గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం

TPT: నారాయణవనం మండలం భీముని చెరువు స్మశానవాటికలో జరుగుతున్న పనులను ఆదివారం జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు కోనేటి సుమన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా భీముని చెరువు, కశిమిట్ట పంచాయతీలలో మెటల్ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.