అండర్-17 క్రికెట్ చాంపియన్ 'పరిగి'

అండర్-17 క్రికెట్ చాంపియన్ 'పరిగి'

VKB: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-17 క్రికెట్ పోటీల్లో పరిగి జట్టు విజేతగా నిలిచింది. పరిగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో పరిగి, వికారాబాద్, తాండూరు, పెద్దేముల్, మోమిన్‌పేట్ జోన్ల జట్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో పరిగి, వికారాబాద్ జట్లు తలపడ్డాయి. తుదిపోరులో పరిగి జట్టు చాంపియన్‌గా నిలిచింది.