చెరువులో పడి యువకుడు మృతి

చెరువులో పడి యువకుడు మృతి

CTR: బైరెడ్డిపల్లి మండలం జోగిండ్లు గ్రామానికి చెందిన మురళి (30) ఆదివారం చెరువులో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. గతంలో పెళ్లి చేసుకున్న అతను భార్య నుంచి విడాకులు తీసుకుని, 5 రోజుల కిందట ఇచ్చాపురానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో బైరెడ్డిపల్లి పెద్ద చెరువులో పడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు.