ములకల గుమడాంలో పోషకాహార మాసోత్సవం

ములకల గుమడాంలో పోషకాహార మాసోత్సవం

VZM : గజపతినగరం మండలంలోని ములకల గుమడాం గ్రామంలో పోషకాహార మసోత్సవం సోమవారం ఐసిడిఎస్ సూపర్‌వైజర్ శ్యామలత పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు బాలింతలు చిరుధాన్యాలు ఎలా వాడాలో వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడి ఆరోగ్య ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.