రైలులో తప్పిపోయిన బాలుడు..

SKLM: విశాఖ నుంచి పలాసకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ బాలుడు గుర్తించబడాడు. నందిగాం మండలం సుభద్రాపురానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి బాలుడు కనిపించాడు. విచారణలో బాలుడు రాజమండ్రి నుంచి తల్లి బాల (30), చెల్లి భవిష్య (8)తో కలిసి రైలెక్కినట్లు తెలిపాడు. రాజమండ్రి హర్షవర్ధన్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఈ బాలుడిని పోలీసులకు అప్పగించాడు.