తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి: మంత్రి
ATP: వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లో శుక్రవారం తాగునీటి నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు నీటి కొరత రాకూడదని హెచ్చరించారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు