'అన్న క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి'

GNTR: అన్న క్యాంటీన్ పరిసరాలు ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు సిబ్బందిని ఆదేశించారు. పొన్నూరులోని అన్న క్యాంటీన్‌ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ నిర్వాహకులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆహార నాణ్యతను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు.