పశువైద్యాధికారిని నియమించాలంటూ రైతుల నిరసన
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామ పశువైద్యశాలలో వైద్యాధికారి లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ MPTC కుందూరు వెంకట రెడ్డి నేతృత్వంలో రైతులు నిరసన తెలిపారు. గ్రామంలో పాడి పంటలపై ఆధారపడి జీవించే ప్రజలు పశువైద్య సేవల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వైద్యాధికారిని నియమించాలని కోరారు.